సీ|| కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పింప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
సీ|| పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెల పాలు పోసి పోసి
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెల వారకుండ మొగ్గలలోనజొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాదిదేవ
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు
సీ| లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను
శ్రీ జంద్యాల పాపయ్యశాస్త్రి గారి పుష్పవిలాపం పద్యాలు
ReplyDeleteఉ. నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
తే.గీ పూలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
శ్రీగురుభ్యోనమ:
ReplyDeleteపరుష పదంబు పల్కడట, పావనచిత్తుడు, కోసలేంద్రుకున్
మురిపము గూర్చువాడతడు, మోహనరూపుడు, దివ్యతేజుకున్
వరములనిచ్చు వేల్పునకు వైభవమొప్పగ పెండ్లి జేయ చూ
పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్.