Thursday, 12 January 2012

శ్రీగురుభ్యోనమ: భరతమాత ధరించిన కిరీటంలో అత్యంత అగ్రభాగమున కోటిసూర్యప్రభలతో ప్రకాశించెడి అపూర్వమైన, అమూల్యమైన వజ్రము స్వామి వివేకానంద.

నేడు స్వామి వివేకానంద జన్మదినం. భరతమాత కీర్తిని విశ్వవ్యాపితం చేసిన మహనీయుడు,యువతను చైతన్యపరచిన ఉత్తుంగతరంగమ, వేదాంతసింహఘర్జన గావించిన చైతన్యహర్యక్షము స్వామి వివేకానంద.

5 comments:

  1. భరతమాతకు మకుటపు వజ్రమతడు
    రామకృష్ణుని ప్రియశిష్యరత్నమతడు
    వేదసింహంపు ఘర్జన విశ్వమందు
    వ్యాప్తి గావించినట్టి ప్రాజ్ఞుడతడు


    వేగంగా తన వాక్ప్రవాహ ఝరితో వేదాంతసింహంబుగా
    నూగించెన్ గురు రామకృష్ణ ప్రభతో నుప్పొంగి భూగోళమున్
    ఆగంభీర మహామనీషి తలపే మదిలో నాహ్లాదమందించగా
    శ్రీగంగాజల స్నానపుణ్యఫలమే సిద్ధించు శీఘ్రంబుగాన్

    ReplyDelete
  2. శ్రీగురుభ్యోనమ:
    భరతమాత ధరించిన కిరీటంలో అత్యంత అగ్రభాగమున కోటిసూర్యప్రభలతో ప్రకాశించెడి అపూర్వమైన, అమూల్యమైన వజ్రము స్వామి వివేకానంద

    భరతమాతకు మకుటపు వజ్రమతడు
    రామకృష్ణుని ప్రియశిష్యరత్నమతడు
    వేదసింహంపు ఘర్జన విశ్వమందు
    వ్యాప్తి గావించినట్టి ప్రాజ్ఞుడతడు

    నేడు స్వామి వివేకానంద జన్మదినం. భరతమాత కీర్తిని విశ్వవ్యాపితం చేసిన మహనీయుడు.యువతను చైతన్యపరచిన ఉత్తుంగతరంగము వేదాంతసింహఘర్జన గావించిన చైతన్యహర్యక్షము స్వామి వివేకానంద

    ReplyDelete
  3. "స్వామివివేకానంద" అన్నది ఒక నామము కాదు. నా దృష్టిలో ఒక మహామంత్రము. ఆ మహానుభావుని స్మరణమాత్రమునే ఆహ్లాదమైన పులకింత కలుగుతుంది. ఆమహానుభావుని దివ్యచరణారవిందములకు నేను సదా సాష్టాంగనమస్కారముల నాచరించెదను.
    "Arise Awake and Stop not till the Goal is reached"
    వేగంబౌ తన వాక్ప్రవాహ ఝరితో వేదాంతసింహంబుగా
    నూగించెన్ గురు రామకృష్ణ ప్రభతో నుప్పొంగి భూగోళమున్
    ఆగంభీర మహామనీషి (తలపే) మదిలో నాహ్లాదమందించగా
    శ్రీగౌరీశు పదాబ్జ సేవ ఫలమే సిద్ధించు శీఘ్రమ్ముగా

    ReplyDelete